|
|
by Suryaa Desk | Sun, Sep 21, 2025, 06:34 AM
రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు, ఎవరిపై, ఎలా స్పందిస్తారో ఊహించడం కష్టం. సమకాలీన అంశాలపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే ఆయన, తాజాగా భారతీయ సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మలయాళ దిగ్గజ నటుడు మోహన్‌లాల్ నటనను ప్రశంసిస్తూనే, ఫాల్కే అవార్డు గురించి ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.మోహన్‌లాల్ నటనకు తాను ఎంతగా ముగ్ధుడ్నయ్యానో వివరిస్తూ వర్మ ఓ ఆసక్తికర పోస్ట్ పెట్టారు. "దాదాసాహెబ్ ఫాల్కే గురించి నాకు పెద్దగా తెలియదు. ఆయన మొదటి సినిమా తీశారని విన్నాను, కానీ ఆ సినిమాను నేను చూడలేదు. దాన్ని చూసిన వాళ్లు కూడా నాకు ఎవరూ తారసపడలేదు. కానీ... నాకు తెలిసిన, నేను చూసిన మోహన్‌లాల్ నటన అమోఘం. నా అభిప్రాయం ప్రకారం, దాదాసాహెబ్ ఫాల్కేకే 'మోహన్‌లాల్ అవార్డు' ఇవ్వాలి" అంటూ వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.కాగా, కొందరు వర్మ వ్యాఖ్యలను అతిశయోక్తిగా కొట్టిపారేస్తుండగా, మరికొందరు మోహన్‌లాల్ నటనపై ఆయనకున్న అభిమానాన్ని ఇది తెలియజేస్తోందని అంటున్నారు.
Latest News