|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 03:38 PM
రైతులకు కేంద్ర పథకాలపై లోక్ సభలో BJP MP మాధవనేని రఘునందన్ రావు ప్రశ్నలకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు. దాదాపుగా రూ.4 లక్షల కోట్లు PM కిసాన్ ద్వారా రైతులకు అందించినట్లు వెల్లడించారు. 28 రైతు పథకాలకు దేశ వ్యాప్తంగా మద్దతు ఉందని తెలిపారు. వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం 2014లో రూ.21,993.50 కోట్ల బడ్జెట్ కేటాయింపులు ఉంటే, 2025-2026 సంవత్సరానికి రూ.127290.16 కోట్లు బడ్జెట్ కేటాయింపులు చేసినట్టుగా వివరించారు.