|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 03:40 PM
దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం సోమవారం తెలిపారు. నిజామాబాద్ కమ్మర్పల్లికి చెందిన చిరంజీవి జల్సాలకు అలవాటు పడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో దొంగతనాలు చేసినట్లు వెల్లడించారు. 18 తులాల బంగారం, 164 తులాల వెండి, లక్ష రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన బంగారాన్ని కొనుగోలు చేసిన నరసయ్యని కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు.