|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 02:16 PM
TG: అత్త అల్లుడిని చంపిన దారుణ ఘటన నిర్మల్ జిల్లా ముధోల్‌లోని తెల్గ తరోడాలో మంగళవారం చోటు చేసుకుంది. షేక్ నజీమ్(45) మహారాష్ట్ర నుంచి వలస వచ్చాడు. నజీమ్ భార్య తమ పిల్లల్ని తీసుకుని వేరే గ్రామానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రతిరోజు మద్యం తాగి వచ్చి అత్త రహీమున్నిసాతో గొడవపడుతుండేవాడు. విసిగిపోయిన అత్త అల్లుడిపై కట్టెతో దాడి చేసింది. ఈ ఘటనలో నజీమ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా అత్త రహీమున్నిసాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.