|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 02:00 PM
హైదరాబాద్‌లోని జువెనైల్ హోమ్ నుంచి ఐదుగురు బాలురు పరారైన ఘటన కలకలం రేపుతోంది. గత ఏడాది నుంచి అక్కడ ఉంటున్న ఈ బాలురు ఇటీవల జువెనైల్ హోం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఐదు రోజులుగా వారి కోసం గాలిస్తున్నారు. బాలురు ఇతర ప్రాంతాలకు పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోంది.