|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 02:20 PM
హైదరాబాద్, ఆగస్టు4 :–బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ జాతిపిత, కేసీఆర్ పై కక్ష పెంచుకున్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధార మైన నిందలు మోపి ఆయనను అరెస్టు చేసి రాక్షస ఆనందం పొందే కుట్ర చేస్తు న్నారని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు,ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ అగ్ని గుండంగా మారు తుందని ఆయన హెచ్చరించారు.అది కాళేశ్వరం కమిషన్ కాదని, కాంగ్రెస్ కక్ష సాధింపు మిషన్ అని జీవన్ రెడ్డి సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. ఆరేళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లునూరేళ్ళ కన్నీళ్లు తుడిచాయని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ అపర భగీరథ యత్నానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనమన్నారు.దేశానికే అన్నం పెట్టే అక్షయ పాత్ర లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మహా జలశక్తి పీఠమని, దేశానికే మార్గ దర్శకం చేసిన సాగునీటి పాఠమని, తెలంగాణ జాతికి విశ్వఖ్యాతి తెచ్చిన కీర్తి కిరీటమని జీవన్ రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ పనితీరుపై కాంగ్రెస్ ది ఓర్వలేని తనమని ఆయన విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఓటుకునోటు కేసులో అరెస్టయి చిప్పకూడు తిన్నా ననే అక్కసుతో రగిలిపోతున్నారని ఆయన అన్నారు. తాను తప్పుచేసి జైలుకు పోయానన్న వాస్తవాన్ని గ్రహించకుండా గుడ్డిగా కేసీఆర్ పై పగ పెంచుకున్న రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని నిందలు మోపి కేసీఆర్ కు అవినీతిని అంటగట్టే దుస్సహాసానికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు.చావునోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించి, రాష్ట్రాన్ని అభివృద్ధి లో దేశంలో కెల్లా అగ్రభాగాన నిలిపి
కాళేశ్వరం ద్వారా కేసీఆర్ సాగునీటిని పారిస్తే, కాంగ్రెస్ విషం పారిస్తోందని జీవన్ రెడ్డి ఆరోపించారు.
కేసీఆర్ తెలంగాణ జాతిపిత, అభివృద్ధి ప్రధాత, సంక్షేమ విధాత అని, దేశానికే పాలనా పాఠాలు నేర్పిన విజనరీ నేతగా కేసీఆర్ చరిత్రకెక్కారని ఆయన పేర్కొన్నారు.
కేసీఆర్ లాంటి మహానేతను అరెస్టు చేసే దుస్సహాసమా? అని ఆయన నిప్పులు చెరిగారు.
కేసీఆర్ పై నిందలు మోపిన సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు ధోరణులను తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తు న్నారని, కేసీఆర్ జోలికొస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తో గోక్కున్నవు..నీకు ఉసురు తగులు తుంది, రాజకీయ భవిష్యత్ లేకుండా కాలగర్భంలో కలిసిపోతావు ఖబడ్దార్ అని జీవన్ రెడ్డి ముఖ్యమంత్రిని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.