|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 12:28 PM
మేడ్చల్ జిల్లా పోచారం పీఎస్ పరిధి అన్నోజిగూడలో మంగళవారం ఓ అయిదేళ్ల బాలుడు తప్పిపోయి ఏడుస్తుండగా పోచారం పోలీసులు అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. జీడిమెట్ల సూరారాం కు చెందిన శ్రావణి తన కొడుకు చరణ్ ను అన్నోజిగూడలోని తన తల్లి వద్ద వదిలివెళ్లిపోయింది. కాగా గవర్నమెంట్ స్కూల్ కు వెళ్లిన చరణ్ తప్పిపోయి అన్నోజిగూడ అయ్యప్ప గుడి వద్దకు చేరుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలుని తల్లిదండ్రుల ఆచూకీ కనుక్కొని వారికి అప్పగించినట్లు పోచారం సీఐ రాజు వర్మ తెలిపారు.