|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 12:30 PM
TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన వివేదిక ఒక బేస్‌లెస్ రిపోర్టు అని BRS నేత, మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో 'కమిషన్ వక్రీకరణలు-వాస్తవాలు' పేరిట ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు."చరిత్రలో చాలా కమిషన్ రిపోర్టులు వచ్చాయి. అవి న్యాయస్థానాల ముందు నిలబడలేదు. ఇదంతా కేసీఆర్‌ను హింసించాలనే తప్ప మరేం లేదు. మొత్తం 650 పేజీల రిపోర్టును అసెంబ్లీలో పెట్టాలి." అని హరీష్ అన్నారు.