|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 11:24 AM
పదవ తరగతిలో టాపర్..ట్రిపుల్ ఐటీలో సీటు రాలేదని విద్యార్థిని ఆత్మహత్య . బాసర ట్రిపుల్ ఐటీలో సీటు రాలేదని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన అదిలాబాద్ జిల్లా బోథ్ మండలం ధన్నూర్ గ్రామానికి చెందిన విద్యార్థిని మనిమెల శైలజ(15). కేజీబీవీలో పదవ తరగతి పూర్తి చేసి 563 మార్కులతో మండల టాపర్‌గా నిలిచిన శైలజ. ట్రిపుల్ ఐటీలో సీటు రాలేదని సోమవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని . తనకు ట్రిపుల్ ఐటీలో సీటు రాలేదని, ఎంపీసీలో చేరతానని ఫోన్ చేసి చెప్పిందని ఇంతలోనే ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసిన ఉపాధ్యాయులు, విద్యార్థులు