|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 11:10 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం జరిగిన ఆటో ప్రమాదంలో విద్యార్థులు గాయపడ్డారు. రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన హర్షవర్ధన్ (15) సహా పలువురు విద్యార్థులు స్కూల్‌కు వెళ్తుండగా, గాయత్రి కాలేజ్ వద్ద కుక్కలు అడ్డొచ్చి ఆటో బోల్తా పడింది. హర్షవర్ధన్ కాలి విరుగుడు కాగా, ఇతరులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. 108 ఆలస్యంగా రావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.