|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 11:09 AM
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని సబ్ స్టేషన్ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాడిపెల్లి నరేష్ (వయసు 36) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య, ఇద్దరు చిన్న కుమారులకు గాయాలు కాగా, ఆమె చేతులు విరిగాయి. బొల్లాపల్లి శ్రీనివాస్‌కు నడుము గాయం, ఆయన భార్య సుజాత చేతులు విరిగాయి. గాయపడినవారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.