|
|
by Suryaa Desk | Tue, Aug 05, 2025, 12:11 PM
తెలంగాణకు వాతావరణశాఖ భారీ వర్ష సూచన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మరికాసేపట్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం ఉందని GHMC తెలిపింది. రాబోయే 2 గంటల్లో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, గాజులరామారం, అల్వాల్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుందని అంచనా వేసింది. GHMC పరిధిలో 20mm వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.