|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 02:45 PM
నల్లగొండలో నూతనంగా నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించిన మంత్రి కోమటి రెడ్డి. ఈ క్యాంపు కార్యాలయానికి “ఇందిరా భవన్” అని నామకరణం చేయడం జరిగింది.నా నల్లగొండ ప్రజలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటూ, వారికి మరింత చేరువగా సేవలందించేందుకు ఇందిరా భవన్ ఉపయోగపడుతుంది.ప్రారంభోత్సవం సందర్భంగా ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ఛైర్మన్ శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు శ్రీ జైవీర్ రెడ్డి, శ్రీ వేముల వీరేశం, శ్రీ బత్తుల లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీ నెల్లికంటి సత్యం గారు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.