|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 02:40 PM
పినపాక మండలంలో ఆగస్టు 10న జరగనున్న దివ్యాంగుల గర్జన మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ములకపల్లి రవి మాదిగ పిలుపునిచ్చారు. సోమవారం ఈ బయ్యారం క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పెన్షన్ హామీని అమలు చేయకపోవడాన్ని తీవ్రంగా విమర్శించారు. అర్హులందరికీ పెన్షన్లు పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.