|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 02:53 PM
కాళేశ్వరం ప్రాజెక్టు అప్పులపై రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తాజాగా సూచన చేసింది. ప్రాజెక్టు పూర్తి చేస్తే అప్పులపై వడ్డీ తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్రం పేర్కొంది. రుణాల చెల్లింపు రీ షెడ్యూల్ మార్పు చేస్తే, ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ఖాతాను స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్‌కు చేయొచ్చని ఆర్థిక శాఖ సూచించింది. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ చామల అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.