|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 11:19 AM
రామచంద్రపురం : బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శ్రావణ మాసం పురస్కరించుకొని భారతి నగర్ డివిజన్ పరిధిలోని బొంబాయి కాలనీలో గల పోచమ్మ మరియు ఎల్లమ్మ బోనాల ఉత్సవాల కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కరుణాకటాక్షాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఐలేష్, నర్సింహ, రవీందర్ రెడ్డి, సామ్యూల్ వినయ్, తదితరులు పాల్గొన్నారు