|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 10:53 AM
హైదరాబాద్‌లో మరోసారి మాదకద్రవ్యాల కలకలం చోటుచేసుకుంది. కొత్తపేటలో డ్రగ్స్ విక్రయిస్తున్న సందీప్‌ను ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేశారు. సమాచారం ఆధారంగా చేసిన తనిఖీల్లో అతని ఇంట్లో 13 గ్రాముల MDMA, అరకిలో గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను యూత్‌కి సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.