|
|
by Suryaa Desk | Mon, Aug 04, 2025, 10:45 AM
TG: రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, సమీక్షలు లేకపోవడం, కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయ లోపమే రాష్ట్రంలో యూరియా, డీఏపీ కొరతకు ప్రధాన కారణమని ఆయన అన్నారు. గత పదేళ్లలో ఎన్నడూ రైతన్నలు ఎరువుల కోసం క్యూ లైన్లు కట్టిన దాఖలాలు లేవన్నారు. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో కేంద్రం నుండి కేటాయించిన ఎరువులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రా చేయలేదన్నారు.