|
|
by Suryaa Desk | Sun, Aug 03, 2025, 09:12 AM
కమీషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ల వినియోగాన్ని నిషేధించినట్లు కరీంనగర్ సీపీ గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు ఈనెల 31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఎవరైనా వినియోగించదలచినట్లయితే సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలని కోరారు. సంబంధిత పోలీసు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.