|
|
by Suryaa Desk | Sun, Aug 03, 2025, 09:11 AM
సికింద్రాబాద్ పరిధి రసూలురలో డ్రగ్స్ దందా జరుగుతోందని సమాచారం ఆధారంగా ఎస్టీఎఫ్ ఎస్ఐ నాగరాజు బృందం శనివారం తనిఖీలు నిర్వహించింది. ఈ దాడిలో 1. 60 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో రోహిత్ శర్మ, భావేష్, సోనుపై కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు. డ్రగ్ మాఫియాపై నిరంతర నిఘా ఉంచుతున్నామన్నారు.