|
|
by Suryaa Desk | Sun, Aug 03, 2025, 09:10 AM
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం రంగపేట శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు కెక్కర్ల సురేష్ (27) మృతి చెందాడు. మద్దికుంటకు చెందిన సురేష్ కరీంనగర్‌లో వాహన షోరూలో పనిచేస్తున్నారు. విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తుండగా, ఇసుక టిప్పర్ ఢీకొట్టింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.