|
|
by Suryaa Desk | Sun, Aug 03, 2025, 09:20 AM
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఏఐసీసీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, జిల్లా ఇన్చార్జి మంత్రి ధనసరి సీతక్క, కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రభాత్ ర్యాలీలో పాల్గొన్నారు.ఆలూరు మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు జై భీమ్, జై భారత్, జై సమ్మిదాన్ లపై కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ఆలూరు మండల కేంద్రంలో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొని పలు ఏరియాల్లో చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను పరిశుభ్రం చేశారు. తర్వాత వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటి మీనాక్షి నటరాజన్ నీళ్లు పోశారు. ఈ కార్యక్రమంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, ఆల్ ఇండియా ఏఐసీసీ రాష్ట్ర యూత్ బాధ్యుడు సంపత్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, ఆలూరు మండల అధ్యక్షుడు ముక్కెర విజయ్, ఆర్మూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చేపూర్ సురకంటి చిన్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆలూ శ్రీనివాస్ రెడ్డి, దేగాం రంగోనీ శ్రీనివాస్ గౌడ్, ఉప్పునూతల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.