|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 03:23 PM
బీసీ బిల్లు సాధన కొరకు కవిత 72 గంటల నిరాహార దీక్షకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య సంపూర్ణ మద్దతు తెలిపారు. తెలంగాణ జాగృతి నేతలు శనివారం ఆయనను కలిసిన సందర్భంగా కృష్ణయ్య మాట్లాడారు. కవిత నిస్వార్ధంగా బీసీల కోసం దీక్ష చేస్తోందని.. ఈ దీక్షతో బీసీల ఉద్యమం మరింత బలోపేతం అవుతుందన్నారు. దాదాపు 40 , 50 ఏళ్ల నుంచి బీసీల కోసం 12 వేలకుపైగా ఉద్యమాలు చేసినట్లు తెలిపారు. కవిత పట్టుదలతో దీక్ష చేస్తుందన్నారు.