|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 03:24 PM
రాహుల్ గాంధీ కోరుకుంటే 2009లోనే ప్రధాని అయ్యేవారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం ఢిల్లీలో ఏఐసీసీ లీగల్ సెల్ సదస్సులో మాాట్లాడారు. 'కార్యకర్తగా రాహుల్ ప్రజల కోసం పని చేశారు. మరోవైపు నరేంద్ర మోదీ 25 ఏళ్లుగా కుర్చీ వదలడంలేదు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ పోరాడతారు. బీజేపీకి 150 సీట్లు దాటకుండా చూస్తాం' అని అన్నారు.