|
|
by Suryaa Desk | Sat, Aug 02, 2025, 03:45 PM
TG: రేవంత్ రెడ్డి ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్‌తో అర్థ శతకం పూర్తి అయిందని.. ఢిల్లీ నుంచి రాష్ట్రానికి 50 పైసలు తేలేదని BRS నేత జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి మాట్లాడారు. 'ఇప్పటివరకు రేవంత్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్లు ఖర్చుచేసింది. ఇందులో రూ.2 లక్షల కోట్ల అప్పు ఉంది. దాదాపు రూ.50 వేల కోట్లు ఢిల్లీకి మూటలు సమర్పించారని మోదీ గతంలో అన్నారు. కేసీఆర్ పదేళ్లలో 10 సార్లు మాత్రమే ఢిల్లీకి వెళ్లారు' అని చెప్పారు.