|
|
by Suryaa Desk | Tue, Sep 16, 2025, 06:32 AM
నటి మంచు లక్ష్మి తన దుస్తులపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. "హీరో మహేశ్ బాబును ఇలాంటి ప్రశ్న అడిగే ధైర్యం మీకుందా అంటూ నెటిజన్లను సూటిగా ప్రశ్నించి, ఈ వివాదానికి కొత్త కోణం ఇచ్చారు. కేవలం మహిళా నటుల దుస్తులనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటారంటూ ఆమె నిలదీశారు., ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో మంచు లక్ష్మి ధరించిన ఓ డ్రెస్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొందరు నెటిజన్లు ఆ దుస్తులు హద్దులు దాటి ఉన్నాయంటూ విమర్శలు గుప్పించారు. ఈ ట్రోలింగ్‌పై తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించిన మంచు లక్ష్మి, నటీనటుల విషయంలో చూపిస్తున్న పక్షపాతాన్ని ఎత్తిచూపారు."మహిళల దుస్తుల ఎంపికపై ఎప్పుడూ విమర్శలు వస్తుంటాయి. కానీ అదే మగ హీరోల విషయంలో ఎందుకు మాట్లాడరు మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలు ఏం వేసుకున్నా ఎవరూ ప్రశ్నించరు కదా ఇది వివక్ష కాదా" అంటూ ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఫ్యాషన్ విషయంలో ఆడవాళ్లపై ఒకలా, మగవాళ్లపై మరోలా వ్యవహరించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.మంచు లక్ష్మి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. మహిళల హక్కుల గురించి మాట్లాడారని, సరైన ప్రశ్న అడిగారని కామెంట్లు చేస్తున్నారు. గతంలో కూడా మహిళా సాధికారత వంటి సామాజిక అంశాలపై తన గళం వినిపించిన మంచు లక్ష్మి, తాజా ఘటనతో ఫ్యాషన్ ప్రపంచంలో లింగ వివక్షపై మరోసారి చర్చను రేకెత్తించారు.
Latest News