|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 10:56 PM
కల్కి సినిమాలో ప్రభాస్, కమల్‌హాసన్ లాంటి స్టార్స్, దీపికా పదుకొనె లాంటి క్రేజీ హీరోయిన్ ఉన్నప్పటికీ… రిలీజ్ తర్వాత మాత్రం వీళ్లకన్నా ఎక్కువగా చర్చలోకి వచ్చిన వ్యక్తి ఇంకొకరు.అదే తరహా ఫీల్ మిరాయ్ సినిమా దగ్గర కూడా కనిపించింది. హీరో తేజ సజ్జా, విలన్ మనోజ్ కంటే… ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన వ్యక్తి మాత్రం ఇంకొకరు.చిన్న పాత్రలో కేవలం కొన్ని నిమిషాలే కనిపించినా, ఆ నటుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే, హైలైట్ అయ్యే సీన్స్ వాళ్లకే వస్తున్నాయి.నటనలో బలమైన ప్రభావం చూపించగల నటుల కోసం దర్శకులు క్రేజ్ ఉన్న స్టార్స్‌ను పక్కన పెడుతున్నారు. బడా స్టార్స్‌ను చిన్న పాత్రల్లో తీసుకుంటే విసుగు కలిగించవచ్చని, ఆ పాత్రల లోతు తగ్గిపోతుందని భావిస్తున్నారు. దాంతో, ఎక్కువగా నోటెడ్ కాకపోయినా, నటనలో పట్టు ఉన్న ఫ్రెష్ ఫేసులకే ఛాన్స్ ఇస్తున్నారు.కొందరు దర్శకులు మాత్రం వీఎఫ్ఎక్స్ సాయంతో ఆ పాత్రలకు బలాన్నిస్తుండగా, మరికొందరు థియేటర్ ఆర్టిస్ట్స్, వెబ్ సిరీస్ నటులను సెలెక్ట్ చేస్తున్నారు.మిరాయ్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించిన గౌరవ్ బోరా — ఆయన ఈ సినిమా ముందు యాడ్స్, షార్ట్ ఫిలింస్, వెబ్ సిరీస్‌ల్లో నటించినప్పటికీ, ఈ ఒక్క సినిమాలో నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ ట్రెండ్ వల్ల… కథలే ప్రధానంగా నిలుస్తున్నాయి. కొత్త నటులకు మంచి అవకాశాలు వస్తున్నాయి. పాత్రలో ఒదిగిపోయే నటులకే డిమాండ్ పెరుగుతోంది.ప్రేక్షకులు కూడా… “ఈ పాత్రలో నటించింది ఎవరు?” అనే ఆసక్తితో గూగుల్‌లో వెతికే స్థితికి చేరుకున్నారు.ఇక దర్శకులు కూడా రిస్క్ తగ్గించుకునేందుకు పేరున్న స్టార్స్ కంటే కొత్తగానే కనిపించే, కానీ బలమైన నటులనే ఎంచుకుంటున్నారు. ఇది కథకు సహాయపడే కొత్త మార్గంగా మారుతోంది.
Latest News