|
|
by Suryaa Desk | Mon, Sep 15, 2025, 08:16 PM
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. కత్రినా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అని, ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో బిడ్డకు జన్మనివ్వనున్నట్లు ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. లాంగ్ మెటర్నిటీ బ్రేక్ ఉన్నారని రాసుకొచ్చింది. కాగా 2021లో విక్కీ, కత్రినా రాజస్థాన్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.అయితే కత్రీనా మాత్రం గత నాలుగేళ్లుగా తన ప్రెగ్నెన్సీ రూమర్స్ ను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తుంది. రూమర్స్ వచ్చిన తరువాతి రోజునే విక్కీతో కలిసి స్విమ్ సూట్ లోనో.. లేక పొట్ట కనిపించే డ్రెస్ లోనో ఫోటోలు పెట్టి అవేమి నిజం కాదని చెప్పుకొచ్చేది. కానీ, ఇప్పుడు మాత్రం నిజంగానే కత్రీనా ప్రెగ్నెంట్ అయ్యిందని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇక ఈ వార్తలపై విక్కీ కూడా స్పందించకపోవడం ఈ వార్తలకు ఆజ్యం పోసింది. దీంతో నిజంగానే కత్రీనా తల్లి కాబోతుందని తెలుస్తోంది.ముఖ్యంగా కత్రీనా ఈ మధ్య బయట ఎక్కడా కనిపించలేదు. ఎయిర్ పోర్ట్ లో కూడా ఆమె కనిపించడం మానేసింది. అంతేకాకుండా రెండు రోజుల క్రితం ఒక వీడియోను పోస్ట్ చేయగా అందులో అమ్మడు కొద్దిగా బరువు పెరిగి.. పొట్ట పెరిగి కనిపించడం ఈ అనుమానాలకు మరింత తావిచ్చింది. దీంతో కత్రీనా కచ్చితంగా ప్రెగ్నెంట్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Latest News