|
|
by Suryaa Desk | Sat, Sep 13, 2025, 03:50 PM
నటి మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్ కేసులో ఇటీవల ఈడీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. ఈ విషయంపై తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. 'ఈ కేసులో చిట్టచివరి వ్యక్తిని విచారించడం హాస్యాస్పదంగా ఉంది. ముందు దీన్ని ఎవరు ప్రారంభించారో చూడండి. అసలు డబ్బు ఎలా సమకూరుతుంది, ఎక్కడికెళ్తుందో ఈడీ విచారించింది. టెర్రరిస్టులకు యాప్స్ ఫండింగ్ చేయడంపై మాకేమీ తెలియదు. 100పైగా సెలబ్రిటీలు ప్రమోట్ చేయడంతో నేనూ చేశానంతే' అని ఆమె తెలిపారు.
Latest News