|
|
by Suryaa Desk | Tue, Sep 09, 2025, 10:39 AM
రూ.60.48 కోట్ల చీటింగ్ కేసులో శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాను సెప్టెంబరు 15న విచారణకు హాజరు కావాలని ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. ఆగస్టు 13న నమోదైన ఈ కేసులో ఇప్పటికే శిల్పా–రాజ్‌లపై లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. ఫిర్యాదుదారుడు, లోటస్ క్యాపిటల్ డైరెక్టర్ దీపక్ కోఠారి 2015లో బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్‌కు పెట్టుబడి పేరుతో రూ.60 కోట్లకుపైగా ఇచ్చారని, కానీ ఆ నిధులను వ్యక్తిగత అవసరాలకు మళ్లించారని ఆరోపించారు.
Latest News