|
|
by Suryaa Desk | Sun, Sep 07, 2025, 08:03 PM
ఓటీటీలో విడుదలైన సినిమా 'ఆదిత్య విక్రమ వ్యూహ'. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీ హర్ష దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.
కథ: విక్రమ్ తన బాల్యంలోనే తల్లిని కోల్పోతాడు. అతని తండ్రి ఓ స్కూల్ టీచర్. అయితే అతను 15 ఏళ్లుగా జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటూ ఉంటాడు. విక్రమ్ కి పెద్దగా చదువు అబ్బదు. కానీ తెలివితేటలు బాగా ఉంటాయి. అందువలన క్రైమ్ కి సంబంధించిన విషయాల్లో .. ఆధారాల ద్వారా ఆ నేరస్థులు ఎవరనేది చెబుతూ పోలీసులకు సహకరిస్తూ ఉంటాడు. వాళ్లిచ్చిన డబ్బులతో బ్రతికేస్తూ ఉంటాడు.అలాంటి విక్రమ్ ను ఒక పోలీస్ ఆఫీసర్ కలుసుకుంటాడు. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలను గురించి ప్రస్తావించాడు. హత్య జరిగిన ప్రదేశంలో హంతకుడు ఒక 'పెయింటింగ్' ను వదిలేసి వెళుతూ ఉంటాడు. అందువలన కిల్లర్ ను 'పెయింటర్' పేరుతో పిలుస్తూ ఉంటారు. అయితే ఏడాదిలో ఒక వారం రోజులు మాత్రమే కిల్లర్ వరుస హత్యలు చేస్తూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ ఆదిత్యతో కలిసి సీరియల్ కిల్లర్ ను పట్టుకోమని కోరతాడు. హంతకుడు ఎవరనేది చెబితే తనకి 15 లక్షలు వస్తాయనే ఆశతో విక్రమ్ అందుకు ఒప్పుకుంటాడు. ఈ కేసును పరిశోధించే ఆదిత్యను కలుసుకుంటాడు. అప్పటికే ఒక హత్య చేసిన పెయింటర్ ను మిగతా హత్యలు చేసేలోగా పట్టుకోవాలని ప్లాన్ చేస్తారు. పెయింటర్ ఎవరు? ఎందుకు అతను వరుస హత్యలు చేస్తున్నాడు? విక్రమ్ కీ .. ఆదిత్యకి గల సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.
Latest News