|
|
by Suryaa Desk | Fri, Sep 05, 2025, 04:54 PM
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'అఖండ-2'. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ 'అఖండ'కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.ఈ సినిమాలో సంయుక్తా మీనన్, హర్షల్ కీలక పాత్రలో నటిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించబోతున్నాడు. ఈ మూవీని బాలయ్య చిన్న కూతురు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై ఎం తేజస్విని సమర్పణలో రామ్ అచంట, గోపీ అచంట నిర్మి్స్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాను తమన్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 25న విడుదల కావాల్సి ఉండగా.. పలు కారణాల వల్ల వాయిదా పడింది. కానీ కొత్త రిలీజ్ డేట్‌ను మాత్రం చిత్రబృందం వెల్లడించకపోవడంతో అసలు ఈ మూవీ ఇప్పట్లో వస్తుందా? లేదా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక అఖండ-2ఎప్పుడెప్పుడు వస్తుందా? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, నందమూరి బాలయ్య ఓ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వెల్లడించారు.''అఖండ-2 సినిమా డిసెంబర్‌లో విడుదల కాబోతుంది. తమన్ సంగీతంపై మరింత సమయం కావాలని అన్నాడు. అఖండ విడుదల సమయంలో సౌండ్ వూఫర్లు బద్దలయ్యాయి. కానీ అఖండ-2 డిసెంబర్‌లో దానికంటే 50 రేట్లు పెద్దగా ఉంటుంది. త్వరలో కచ్చితమైన రిలీజ్ తేదీని ప్రకటిస్తాము. అభిమానుల అంచనాలను మించి ఉంటుంది. బాక్సాఫీసులో చరిత్ర సృష్టించబోతున్నాము''అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న అభిమానులు కొందరు సంతోష పడుతుంటే.. మరికొందరు మాత్రం కాపీ చేసే సంగీతానికి ఇంకెన్ని రోజులు సమయం తీసుకుంటావని తమన్‌ను తిట్టిపోస్తున్నారు.
Latest News