|
|
by Suryaa Desk | Tue, Sep 02, 2025, 08:49 PM
సంక్రాంతి హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న వెంకీ ఇప్పుడు త్రివిక్రమ్‌తో జట్టు కట్టాడు. గతంలో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి వంటి సినిమాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేసిన సంగతి తెలిసిందే.ఇప్పుడు మాత్రం ఆయన డైరెక్ట్‌గా వెంకీని తెరకెక్కించబోతున్నాడు. ఎప్పటినుంచో అభిమానులు ఎదురుచూస్తున్న వెంకీ–త్రివిక్రమ్ కాంబినేషన్ చివరికి నిజమైంది. కుటుంబ భావోద్వేగాలతో పాటు త్రివిక్రమ్ స్టైల్ కామెడీ, పంచ్ డైలాగ్‌లతో ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతుందన్న టాక్ వినిపిస్తోంది.ఈ సినిమాలో హీరోయిన్‌గా అనేక పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నేహా శెట్టి, శ్రీనిధి శెట్టి వంటి నటీమణుల పేర్లు గట్టిగా వినిపించాయి. అయితే తాజాగా లభించిన సమాచారం ప్రకారం వెంకీ సరసన హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టిను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.హారిక అండ్ హాసిని బ్యానర్‌పై సూర్యదేవర చినబాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట రమణ C/O ఆనంద నిలయం, అలివేలు వెంకటరత్నం వంటి టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ నెలాఖరులో రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే త్రివిక్రమ్‌కు సెట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు.అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దుకుంటున్న వెంకీ–త్రివిక్రమ్ సినిమా నవ్వులు, ఎమోషన్లతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేయడం ఖాయం.
Latest News