|
|
by Suryaa Desk | Sun, Aug 24, 2025, 06:54 PM
ప్రముఖ హాలీవుడ్ అసిస్టెంట్ డైరెక్టర్ డియోగో బోరెల్లా(47) గుండెపోటుతో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటలీలో ఓ సిరీస్ షూటింగ్ సమయంలో సెట్‌లోనే ఆయన కుప్పకూలారు. చిత్ర బృందం హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అతడి పర్యవేక్షణలో ‘ఎమిలీ ఇన్ పారిస్’ సీజన్-5 అనే సిరీస్ చివరి సన్నివేశం షూటింగ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మృతితో తాత్కాలికంగా షూటింగ్ ఆపేశారు.
Latest News