|
|
by Suryaa Desk | Thu, Aug 21, 2025, 06:01 PM
టాలీవుడ్ యువ నటుడు రామ్ పోతినేని యొక్క కొత్త చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ సింగల్ ని నువ్వుంటే చాలే అనే టైటిల్ తో విడుదల చేయగా భారీ స్పందన లభించింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నవంబర్ 28న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో రావు రమేష్, మురలి శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, విటివి గణేష్ మరియు ఇతర ప్రముఖ నటులు కూడా ఉన్నారు. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కన్నడ నటుడు ఉపేంద్ర ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ మైథ్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో వివేక్ మరియు మార్విన్ కంపోజ్ చేసిన సంగీతం ఉంది.
Latest News