|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 04:06 PM
2022లో విడుదలైన మసూద తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. భయపెట్టే హార్రర్ కథతో పాటు, నటీనటుల నేచురల్ యాక్టింగ్ కూడా కి పెద్ద హైలైట్ అయ్యింది.ముఖ్యంగా చిన్నారి పాత్రలో కనిపించిన బాంధవి శ్రీధర్.. దెయ్యం పట్టిన పాపగా అందరినీ ఫిదా చేసింది. ఆ హిట్ అయిన తర్వాత బాంధవి ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పుడు ఆమె రియల్ లైఫ్ లుక్ మాత్రం వారెవ్వా అనేలా ఉంది. వరుస ఫొటోషూట్లతో సోషల్ మీడియాలో తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులో క్రేజ్ పెంచుకుంటుంది. ఇటీవల షేర్ చేసిన ఫొటోలలో జీన్స్ ప్యాంట్, ట్రెండీ లుక్‌లో గ్లామర్ చూపిస్తూ కట్టిపడేసింది. ఈ ఫొటోలు చూసి నెటిజన్స్ ఓ రేంజ్‌లో కామెంట్లు పెడుతున్నారు. త్వరలోనే ఈమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడం పక్ాక అంటున్నారు.ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. బాంధవికి ఇప్పటికే కొన్ని ల ఆఫర్లు వస్తున్నాయట. ఓ రెండు ప్రాజెక్ట్స్ గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే అధికారికంగా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. హీరోయిన్‌గా లాంచ్ అయ్యే అవకాశం బలంగా ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. స్క్రీన్‌పై భయపెట్టిన ఈ మసూద చిన్నారి… రాబోయే రోజుల్లో గ్లామర్ హీరోయిన్‌గా ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకుపోతుందా? అని ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది.