|
|
by Suryaa Desk | Wed, Aug 20, 2025, 02:48 PM
రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన 'జూనియర్' లో కిరీటి ప్రధాన పాత్రలో నటించారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం జూలై 18, 2025న గొప్పగా కన్నడ మరియు తెలుగులో విడుదల అయ్యింది. ఈ యూత్ ప్రేమకథ చిత్రంలో కిరీటి సరసన జోడిగా శ్రీలీల నటిస్తున్నారు. రజనీ కొర్రాపతి నిర్మించిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రవిచంద్రన్, వైవా హర్ష మరియు జెనీలియా కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా యొక్క ఆడియో రైట్స్ ని ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాలోని లెట్స్ లివ్ థిస్ మూమెంట్ వీడియో సాంగ్ ని ఆగష్టు 21న ఉదయం 10 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
Latest News