|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 11:27 PM
ముఖ నిర్మాత బన్నీ వాస్ చేతుల మీదుగా 'బరాబర్ ప్రేమిస్తా' నుంచి 'గుంజి గుంజి' పాట విడుదల
యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాకర్ల సత్యనారాయణ సమర్పణలో, సిసి క్రియేషన్స్ & ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ కథానాయికగా నటిస్తుండగా, 'ఇష్టంగా' ఫేమ్ అర్జున్ మహీ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు.ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ సోషల్ మీడియాలో మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.ఆడియో ప్రమోషన్స్‌లో భాగంగా... మునుపటి మాస్ బీట్ “రెడ్డి మామ” సాంగ్‌ను నిర్మాత దిల్ రాజు విడుదల చేయగా, అది యూట్యూబ్‌లో మంచి స్పందనను రాబట్టింది. తాజాగా, మరో ఎనర్జిటిక్ యూత్‌ఫుల్ మాస్ నంబర్ **‘గుంజి గుంజి’**ను సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ విడుదల చేశారు.ఈ పాటకు రోల్ రైడా ఆసక్తికరమైన సాహిత్యం అందించగా, ఆర్ఆర్ ధృవన్ సంగీతం అందించి స్వయంగా ఆలపించారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో చంద్రహాస్ స్టెప్పులు పాటలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.పాట విడుదల సందర్భంగా బన్నీ వాస్ మాట్లాడుతూ:“చంద్రహాస్ నటించిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం నుంచి ‘గుంజి గుంజి’ పాటను విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ చిత్రానికి ధృవన్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. అతను నా సినిమాకీ పని చేస్తున్నాడు. రోల్ రైడా లిరిక్స్ బాగా రాశాడు. పాట యూత్‌ఫుల్‌గా, వినడానికి ఎంజాయ్ చేయదగ్గలా ఉంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్” అని తెలిపారు.ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే మూవీ గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.ఈ చిత్రానికి వైఆర్ శంకర్ సినిమాటోగ్రఫీ అందించగా, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.