|
|
by Suryaa Desk | Tue, Aug 19, 2025, 09:14 AM
ప్రముఖ యూట్యూబర్ మౌలి తనుజ్ ప్రశాంత్ 'లిటిల్ హార్ట్స్' చిత్రంతో ప్రధాన నటుడిగా తన సిల్వర్ స్క్రీన్ అరంగేట్రం కోసం సన్నద్ధమవుతున్నాడు. సాయి మార్తాండ్ రచన మరియు దర్శకత్వం వహించిన లిటిల్ హార్ట్స్ చిత్రం సెప్టెంబర్ 12, 2025న విడుదల కానుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క టీజర్ లాంచ్ ఈవెంట్ ని హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో మధ్యాహ్నం 4:05 గంటలకి అనిల్ రావిపూడి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. శివానీ నాగరం ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రలో కనిపిస్తుంది. 90 ఫేమ్ ఆదిత్య హసన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాజీవ్ కనకాలా, ఎస్ఎస్ కాంచీ, అనిత చౌదరీ, మరియు సత్య కృష్ణన్ ఈ చిత్రంలో సహాయక పాత్రలు పోషించారు. బన్నీ వాస్, వంశి నందిపతి ఈ చిత్రాన్ని పంపిణీ చేస్తున్నారు.
Latest News