|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 05:03 PM
AR మురుగాడాస్ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవిప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'స్టాలిన్' రీ రిలీజ్ విడుదల కోసం సిద్ధమవుతోంది. 2006లో మొదట విడుదలైన ఈ సినిమాని అనియానా ప్రొడక్షన్స్ పై నిర్మించారు. ఇప్పుడు బ్యానర్ ఈ చిత్రంపై పునరుద్ధరణ పనులను ప్రారంభించింది మరియు మెరుగైన దృశ్య అనుభవం కోసం 8K వెర్షన్‌గా మారుస్తోంది. ఈ చిత్రం ఆగష్టు 22న విడుదల కానుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క హైదరాబాద్ బుకింగ్స్ రేపు అంటే ఆగష్టు 19న మధ్యాహ్నం 12 గంటలకి ఓపెన్ కానున్నట్లు ప్రకటించారు. ఈ విషయాని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. త్రిష ఈ చిత్రంలో మహిళా ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రంలో కుష్బూ సుందర్, ప్రకాష్ రాజ్, సునీల్, రవళి మరియు ఇతరులు కీలక పాత్రలలో ఉన్నారు. మణి శర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.
Latest News