|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 04:16 PM
ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా మనందరికీ సుపరిచితమే.తన ఫస్ట్ మూవీతోనే ఈ బ్యూటీ యూత్ క్రష్‌గా మారిపోయింది. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఫిదా చేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. సిద్ధు జొన్నలగడ్డ సరసన తెలుసు కదా మూవీలో నటిస్తోంది. ఇందులో శ్రీనిధి శెట్టి కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ మెప్పిస్తోంది ఈ అమ్మడు. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన గ్లామర్‌తో హీట్ పుట్టించడంతో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా పెంచుకుంటుంది.ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా రాశి ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో ట్యాక్సీలో కూర్చొని క్యూట్ స్మైల్ ఇచ్చింది. అలాగే కారు డోర్ ఓపెన్ చేసి దిగుతున్నట్లుగా ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. ఇక వీటికి.. 'అన్ని బ్లూస్ చెడ్డవి కావు, కొన్ని నగర దృశ్యంతో వస్తాయి' అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు మాటలు నీ అందాన్ని డిస్‌క్రైబ్ చేయలేవు రాశీ అని, సో బ్యూటిఫుల్ అని, బ్లూ ఇన్ బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Latest News