|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 03:54 PM
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ హైకోర్టులో పిటిషన్ వేశారు. మంత్రి పదవిలో ఉండి సినిమాల్లో నటించడం రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. దీనిపై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. హోం, జీఏడీ, ఏసీబీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు, సీబీఐ పేరును కూడా రికార్డులో చేర్చాలని ఆదేశించింది. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
Latest News