|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 09:13 AM
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన 'కూలీ' చిత్రం ఆగష్టు 14న గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ ని అందుకుంటుంది. ఈ సినిమా బాక్స్ఆఫీస్ వద్ద సాలిడ్ స్టార్ట్ ని అందుకొని భారీ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ చిత్రంలో రజనీకాంత్ గోల్డ్ స్మగ్లర్ పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా యొక్క తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ ని ఆసియాన్ సురేష్ ఎంటెర్టైన్మ్నెట్ బ్యానర్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నైజాంలో విడుదలైన మూడవ రోజున 2.5 కోట్లు వాసులు చేసినట్లు ప్రకటించారు. దీనితో టోటల్ గా నైజాం రీజియన్ లో ఈ సినిమా యొక్క మూడు రోజుల కలెక్షన్స్ 10.5 కోట్ల మార్క్ కి చేరుకుంది. ఈ చిత్ర నిర్మాణాన్ని కళానిధి మారన్ తన సన్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అనిరుద్ అందించారు. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్ మరియు జూనియర్ ఎంజిఆర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు.
Latest News