|
|
by Suryaa Desk | Mon, Aug 18, 2025, 08:55 AM
ప్రముఖ నటులు సత్య రాజ్, సత్యం రాజేష్, వశిష్ట ఎన్ సింహ 'త్రిబనాధరి బర్బారిక్' లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగష్టు 22న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి భారీ స్పందన లభించింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా డైరెక్టర్ మోహన్ శ్రీవత్స కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో సాంచి రాయ్, ఉదయభాను, క్రాంతి కిరణ్, Vtv గణేష్, మొట్టా రాజేంద్ర, ప్రభావతి, మేఘన మరియు కార్తికేయ కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ నంబూరు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ మరియు రామ్ సుంకర స్టంట్స్ పర్యవేక్షిస్తున్నారు. విజయపాల్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఇన్ఫ్యూషన్ బ్యాండ్ సంగీతం అందించింది.
Latest News