|
|
by Suryaa Desk | Sun, Aug 17, 2025, 06:12 PM
పెళ్లి అయిన నాలుగు నెలలకే రష్యాకు చెందిన మోడల్, మాజీ మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ క్సేనియా అలెగ్జాండ్రోవా(30) మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం రేపింది. జులై 5న తన భర్తతో కలిసి వెళ్తుండగా తమ కారు ఓ జంతువును ఢీకొట్టింది. ఈ ఘటనలో క్సేనియా తలకు తీవ్ర గాయమైంది. అప్పటి నుంచి మాస్కోలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మరణించారు. కాగా 2017లో మిస్ రష్యా పోటీలో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచారు. అదే ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్నారు.
Latest News