|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 05:27 PM
పాన్-ఇండియా హీరో అల్లు అర్జున్ మరియు దీపికా పదుకొనే యొక్క హై-బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మాగ్నమ్ ఓపస్ తాత్కాలికంగా AA22XA6 పేరుతో ప్రారంభమైంది. భారతీయ సినిమాలలో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఈ సినిమా ఒకటి. దీపికా పాడుకొనే, మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన నటిస్తున్నారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో ప్రముఖ నటి రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో లేటెస్ట్ టాక్. రానున్న రోజులలో ఈ విషయం పై క్లారిటీ రానుంది. ఈ సినిమా 800 కోట్ల బడ్జెట్ లో రూపొందుతుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్స్ లో నటిస్తున్నట్లుసమాచారం. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ సినిమాకి యువ తమిళ సంగీత దర్శకుడు సాయి అభ్యంక్కర్ సౌండ్‌ట్రాక్‌ను స్కోర్ చేయనున్నారు. ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తుంది.
Latest News