|
|
by Suryaa Desk | Sat, Aug 16, 2025, 03:25 PM
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు రాజకీయ, సినీ ప్రముఖులు, అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ కూడా రజనీకాంత్‌కు అభినందనలు తెలిపారు. ‘వెండి తెరపై సూపర్ స్టార్ రజనీ’ అని టైటిల్ కనిపించగానే థియేటర్ ఏ విధంగా మారుమోగుతుందో పలుమార్లు చెన్నైలో చూశాను. సినీ జీవితంలో స్వర్ణోత్సవం చేసుకుంటున్న సూపర్ స్టార్ శ్రీ రజినీకాంత్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు’ అంటూ పేర్కొన్నారు.
Latest News