|
|
by Suryaa Desk | Fri, Aug 15, 2025, 11:09 PM
"మయసభలో కృష్ణం నాయుడు పాత్రను పోషించిన ఆది పినిశెట్టి నటనపై దర్శకుడు దేవా కట్ట తన అభిప్రాయాలను పంచుకున్నారు."
“ఆది పినిశెట్టి తండ్రి రవి రాజా పినిశెట్టి 40కి పైగా తెలుగు హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన పేరు గాంచిన డైరెక్టర్. చిరంజీవి, బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్ వంటి లెజెండ్స్‌తో ఆయన పని చేశారు. కానీ ఆది మాత్రం వారసత్వం ఆధారంగా కాదు — తానుగా గెలుచుకున్న గుర్తింపు ద్వారా నిలిచాడు.”ఆది తన నటనా ప్రయాణాన్ని 2006లో వచ్చిన ఒక వి చిత్రమ్ సినిమాతో ప్రారంభించారు. 2009లో తమిళ చిత్రం ఈరమ్ తో మొదటిసారి విపరీతమైన గుర్తింపు పొందాడు. ఆ తరువాత సరైనోడు, నిన్ను కోరి, రంగస్థలం, మృగం, మరగత నాణయం వంటి చిత్రాల్లో విలక్షణమైన పాత్రలతో వెర్సటైల్ యాక్టర్‌గా ముద్ర వేసుకున్నాడు."నిన్ను కోరి"లో ఆయన నటన నాకు మొదట ఆకట్టుకుంది – అప్పుడు నుంచే ఆయన డిక్షన్, పాత్రలో చూపిన గంభీరత చూసి ఆశ్చర్యపోయాను.మయసభ ఓటీటీ ఫార్మాట్‌కి మారగానే, ముఖ్య పాత్రలకు నేను మొదటగా గుర్తు పెట్టుకున్న పేరు – ఆది. స్క్రిప్ట్‌ను పంపిన తర్వాత, ఎనిమిది గంటల Zoom కాల్‌లో ఆయనకు మొత్తం కథను నరేట్ చేశాను. రెండు లీడ్ పాత్రల్లో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, చైతన్య రావు పాత్రకు కాస్టింగ్ పూర్తి చేసిన తరువాత, KKN పాత్రకు ఆది సరైన ఎంపికగా కనిపించాడు.ఆ తర్వాత ఆదితో పని చేయడం నిజంగా ఒక ప్రయాణంలా అనిపించింది.KKN పాత్రలో ఎంతో లోతు ఉంది – నత్తి సమస్య, ఆర్థిక కష్టాలు, అయినా ఎప్పుడూ ఆలోచనాత్మకంగా వ్యవహరించే నాయకత్వ లక్షణం ఉన్న పాత్ర. ఆది ఈ పాత్రను ఒక మరాథాన్ పరిగెత్తినట్టు తీసుకున్నాడు – స్క్రిప్ట్‌కు తగ్గట్టు బాడీ లాంగ్వేజ్, డైలాగ్‌లు మాత్రమే కాదు, మాటల మధ్య నిశ్శబ్దానికి కూడా ప్రాముఖ్యత ఇచ్చాడు.ఆయన డెడికేషన్ అద్భుతం – స్క్రిప్ట్ రీడింగ్స్‌లో స్కూల్ పిల్లాడిలా పాల్గొని, నత్తిని చక్కగా ప్రదర్శిస్తూ, చాలా జాగ్రత్తగా పాత్రను డెవలప్ చేశారు. చైతన్య రావుతో నిజ జీవిత స్నేహం కూడా షోకు ప్లస్ అయింది.ఆది చూపించిన చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్‌లు, హావభావాలు అనేక అద్భుతమైన మోమెంట్స్‌ను తెచ్చాయి.
*ఇందుకు ఉదాహరణగా:
-మూడో ఎపిసోడ్‌లో బస్సులో MSR చేతిని పలకరించే ముందు తన రక్తమయమైన చేతిని చూస్తున్న దృశ్యం — ఓ పవర్‌ఫుల్ ట్రైలర్ షాట్‌గా నిలిచింది.
-నామినేషన్ పేపర్లు తీసుకునే సమయంలో, CBRను ఎదురించే డైలాగ్‌ను తనదైన శైలిలో మరింత హీరోయిక్‌గా మార్చాడు – ఆ సన్నివేశానికి స్థాయిని పెంచాడు.
-ఈ సిరీస్‌కు వచ్చిన విమర్శకుల ప్రశంసలు, ఆదికి వచ్చిన దేశవ్యాప్త గుర్తింపు ఆయన కెరీర్‌ను ఇంకొంత ఎత్తుకు తీసుకెళ్తాయనే నమ్మకం ఉంది.
-ఈ రోజు, అతను తెలుగు పొలిటికల్ డ్రామాలో అంబిషన్‌కు ప్రతీకలా నిలిచాడు.ఆయన చేసిన ప్రయాణం – మంచి స్క్రిప్ట్ కోసం సాగిన నిరీక్షణ, కొన్ని తక్కువ స్థాయి కథలను తిరస్కరించిన ధైర్యం – ఇవన్నీ ప్రతీ అడుగులో అసలైన విలువను నిరూపించాయి.