|
|
by Suryaa Desk | Fri, Aug 15, 2025, 03:47 PM
బహుముఖ కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి ఇటీవల గ్రామీణ కుటుంబ వినోదం 'తలైవన్ తలైవి' తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిత్యా మీనన్ ఈ సినిమాలో మహిళా ప్రధాన పాత్ర పోషించారు. తమిళ వెర్షన్ విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బలంగా ప్రారంభమైంది. తెలుగులో ఈ చిత్రం 'సర్ మేడం' అనే టైటిల్ తో విడుదల అయ్యింది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం ఆగష్టు 22న ప్రసారానికి అందుబాటులోకి రానున్నట్లు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రానికి పండిరాజ్ దర్శకత్వం వహించారు. యోగి బాబు, రోషిని హరిప్రియన్ మరియు దీపా శంకర్ కీలక పాత్రలు పోషించగా, సంతోష్ నారాయణన్ సంగీతాన్ని స్వరపరిచారు. ఈ సినిమాని సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మించారు.
Latest News