|
|
by Suryaa Desk | Fri, Aug 15, 2025, 03:38 PM
మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'విశ్వంబర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అభిమానులు ఈ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. దర్శకుడు మల్లిడి వాసిష్టా ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కానున్నట్లు వెల్లడించారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా టీజర్ 2025 ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు విడుదల కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానున్న రోజులలో ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. టీజర్‌తో పాటు విడుదల తేదీ ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది కానీ ఈ సమయంలో దానిపై స్పష్టత లేదు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్ ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. UV క్రియేషన్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
Latest News